Thursday, 4 July 2013
Wednesday, 22 May 2013
Tuesday, 26 March 2013
Friday, 15 March 2013
దేవుడ్ని మర్చిపోదామిక.. పుస్తక పరిచయం
నేనే రాసిన పుస్తకం ‘దేవుణ్ణి మరచిపోదామిక’ - FORGET THE GOD REMEMBER SACHIN పై http://pustakam.net/?p=14238 లో యశస్వి సతీశ్ గారురాసిన సమీక్ష ఇది. ధన్యవాదాలు సతీశ్ గారు.
దేవుడ్ని మర్చిపోదామిక : ఈ పుస్తకం చదవడం పూర్తిచెయ్యగానే.. ఆలోచనలనుంచి
బయటపడడం కష్టమైంది.
ఎప్పుడో చదివిన విషయం గుర్తుకువచ్చింది.
డిసెంబరు 9, 1979 న అమెరికా లోని ఉత్తర ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక రోడ్డు ప్రమాదం
జరిగిందట. ఓ తల్లి కళ్ళెదుటే తన 18 ఏళ్ళ బిడ్డను రోడ్డు ప్రమాదంలోఎప్పుడో చదివిన విషయం గుర్తుకువచ్చింది.
డిసెంబరు 9, 1979 న అమెరికా లోని ఉత్తర ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక రోడ్డు ప్రమాదం
కోల్పోయింది. 19 ఏళ్ళ డ్రైవర్ తాగిన మైకంలో కారుతో గుద్ది చావుకు
కారణమయ్యాడు. ఆమె పేరు Beckie Brown తన కడుపుకోత వేదనను క్రోధంగా, కన్నీటిగా
జార్చలేదు ఆ తల్లి. తాగి వాహనం నడిపే చర్యకు వ్యతిరేకంగా ఒక సంస్థను
నెలకొల్పింది. అదే MADD (Mothers Against Drunk Driving) ప్రభుత్వం మీద,
వ్యవస్థలో లోపాల మీద, తాగుబోతు ల మీద ఒకరకంగా యుధ్ధం ప్రకటించింది. ఆమె కారణం
గా చట్టాలు మారాయి. మరెన్నో విజయాలతో పాటు ఇప్పటివరకూ 3 లక్షల మంది ప్రాణాలు
కాపాడిన ఘనత సొంతం చేసుకుంది. ఎంతగొప్పవిషయం ఇది.. ఒక సాధారణ తల్లి కే ఇంత
విజయం సాధ్యమైతే.. అందరం ఆశ్చర్యపోతాం. మెచ్చుకుంటాం.. వీలైతే చేయందిస్తాం..
అదేకదా జీవన సాఫల్యత! మనిషిలో మనిషిని దర్శించడం అంటే అదే..
రేగళ్ళ సంతోష్ కుమార్ అనే ఆటల సంపాదకుడు (అదేనండీ ..ఈనాడు క్రీడా విభాగపు
రౌతు) తన కింత కాలం చేతి నిండా పని కల్పించిన సచిన్ టెండుల్కర్ అనే పందెపు
గుర్రాన్ని పాల కడలిలో అంజనం వేసి చూపించేశాడు
మేమంతా మీ ’ఆవు’ అని ఆటపట్టించినా.. ఆట కోసమే కదా అని ఇన్నాళూ ఊరుకొని ఈరోజు
నిజంగా సచిన్ కామధేనువే కాదు, కల్పవృక్షమూ ఐరావతమూ, ఉఛ్ఛైశ్వమూ అని చూపడానికి,
ఉదాహరణలతో తెలుపడానికీ సాహసం కావాల్సిందే. అదేమాట అడిగి చూడండి సంతోష్ ని.. పుట్
బాల్ లో పీలే , మారడోనా కలిస్తే .. క్రికెట్లో సచిన్ అని అలెన్ డోనాల్డ్
అనగాలేనిది నా మాట ఎంత!! అని తేటతెల్లం చేస్తాడు. ఆకతాయి సచిన్నోడి కసిని
అన్నయ్య అజిత్ కృషిగా మరల్చడంలో ఓ రాయేశాడని సెలవిచ్చేస్తాడు.
నిజమే ప్రవాహానికి ఆనకట్ట కట్టడంలోనే మనిషి గొప్పదనముంది. అది Beckie Brown
ఐనా, సచిన్ టెండుల్కర్ ఐనా..
ఒక యోధుడి వ్యక్తిత్వ ఆవిష్కరణ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. క్రికెట్ మైదానానికి
అవతలవైపునే రచయిత ఫొకస్. ముందు మాటలో వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ చెప్పినట్టు..
ఒక మనిషిని దేవుడిలా అభిమానించే స్థాయికి దోహదం చేసిన అసక్తికర అంశాల సమాహారం
ఈ.. ప్రయత్నం.
మైదానంలో వేల మంది తనను చూస్తున్నా, కోట్ల ఆశలను మోస్తూ ప్రపంచాన్ని తన
తన్మయత్వంలో ముంచి ఆడిన ఆట మనం ఇకముందు చూడలేకపోవచ్చు..అతడ్నెలా
గుర్తించుకోవాలి! అన్న మాటకు సమాధానమే ఈ పుస్తకం.
ఎవరు సలహాలిచ్చినా సచిన్ నాలాగే వింటుంటాడట బ్రదర్!.. ఓ ఉద్యోగి తన సహచరుడితో
పరాచకాలు..
కోం ముహ్ ఖరాబ్ కర్ లే తేరే.. సచిన్ అక్తర్ తో అన్నట్టు ఓ బూతులాట గాడికి
క్ర్రీడాస్ఫూర్తి ఉన్నవాడి సలహా..
ఏపనికైనా సచిన్ 20 నిముషాలు ముందుంటాడట.. ఓ వ్యక్తిత్వ వికాస శిక్షకుడి
ఉదాహరణ..
తన వాచ్ మెన్ కొడుకు, చిన్నప్పటి స్నేహమేనంట.. పర్సనల్ అసిస్టెంట్.. తెలుగు
సినిమా పంచిన మంచిలోంచి సచిన్ ని కొలుస్తూ.. ఓ కాలేజీ కుర్రాడు..
ఇవన్నీ తెలిపేవి అతడో సెంచరీల వరద, రికార్డుల హోరు మాత్రమేకాదని, సచినంటే
వినయం.. నిగ్రహం.. నిరంతర సాధన.. నిత్య విజ్ఞానార్జన, మంచితనం.. అందుకే
పరుగుల దేవుణ్ని మర్చిపోయి సచిన్ ను గుర్తుంచుకుందాం అంటారు క్రీడా స్ఫూర్తి
తో రచయిత.
అరే.. నీకీ విషయం తెలుసా!.. చిన్నప్పుడు సచిన్ అందర్నీ కొట్టేవాడట.. కోపిష్ఠి
మెకన్రో ని ఆరాధించేవాడట..ఓ పిల్లవాడు తనలో సచిన్ ను చూసుకునే ప్రయత్నం..
తిరుగులేదు.. వీడు మనకొక ఆశాకిరణం. కావాల్సింది పట్టుదలే మనవాడికి.
“సచిన్ లా మెదటి మ్యాచ్ డకౌట్ కాదురా నేనూ..” సచిన్ ను దాటాలనే ఆశ.. వీడూ
గొప్పోడవుతాడు.. చదువులోనైనా.. ఆటలోనైనా..ఉద్యోగంలోనైనా.. జీవితం లోనైనా.. ఇది
నిజంగా ఛాంపియన్లను తయారుచేసే ప్రయత్నమే..
జార్చలేదు ఆ తల్లి. తాగి వాహనం నడిపే చర్యకు వ్యతిరేకంగా ఒక సంస్థను
నెలకొల్పింది. అదే MADD (Mothers Against Drunk Driving) ప్రభుత్వం మీద,
వ్యవస్థలో లోపాల మీద, తాగుబోతు ల మీద ఒకరకంగా యుధ్ధం ప్రకటించింది. ఆమె కారణం
గా చట్టాలు మారాయి. మరెన్నో విజయాలతో పాటు ఇప్పటివరకూ 3 లక్షల మంది ప్రాణాలు
కాపాడిన ఘనత సొంతం చేసుకుంది. ఎంతగొప్పవిషయం ఇది.. ఒక సాధారణ తల్లి కే ఇంత
విజయం సాధ్యమైతే.. అందరం ఆశ్చర్యపోతాం. మెచ్చుకుంటాం.. వీలైతే చేయందిస్తాం..
అదేకదా జీవన సాఫల్యత! మనిషిలో మనిషిని దర్శించడం అంటే అదే..
రేగళ్ళ సంతోష్ కుమార్ అనే ఆటల సంపాదకుడు (అదేనండీ ..ఈనాడు క్రీడా విభాగపు
రౌతు) తన కింత కాలం చేతి నిండా పని కల్పించిన సచిన్ టెండుల్కర్ అనే పందెపు
గుర్రాన్ని పాల కడలిలో అంజనం వేసి చూపించేశాడు
మేమంతా మీ ’ఆవు’ అని ఆటపట్టించినా.. ఆట కోసమే కదా అని ఇన్నాళూ ఊరుకొని ఈరోజు
నిజంగా సచిన్ కామధేనువే కాదు, కల్పవృక్షమూ ఐరావతమూ, ఉఛ్ఛైశ్వమూ అని చూపడానికి,
ఉదాహరణలతో తెలుపడానికీ సాహసం కావాల్సిందే. అదేమాట అడిగి చూడండి సంతోష్ ని.. పుట్
బాల్ లో పీలే , మారడోనా కలిస్తే .. క్రికెట్లో సచిన్ అని అలెన్ డోనాల్డ్
అనగాలేనిది నా మాట ఎంత!! అని తేటతెల్లం చేస్తాడు. ఆకతాయి సచిన్నోడి కసిని
అన్నయ్య అజిత్ కృషిగా మరల్చడంలో ఓ రాయేశాడని సెలవిచ్చేస్తాడు.
నిజమే ప్రవాహానికి ఆనకట్ట కట్టడంలోనే మనిషి గొప్పదనముంది. అది Beckie Brown
ఐనా, సచిన్ టెండుల్కర్ ఐనా..
ఒక యోధుడి వ్యక్తిత్వ ఆవిష్కరణ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. క్రికెట్ మైదానానికి
అవతలవైపునే రచయిత ఫొకస్. ముందు మాటలో వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ చెప్పినట్టు..
ఒక మనిషిని దేవుడిలా అభిమానించే స్థాయికి దోహదం చేసిన అసక్తికర అంశాల సమాహారం
ఈ.. ప్రయత్నం.
మైదానంలో వేల మంది తనను చూస్తున్నా, కోట్ల ఆశలను మోస్తూ ప్రపంచాన్ని తన
తన్మయత్వంలో ముంచి ఆడిన ఆట మనం ఇకముందు చూడలేకపోవచ్చు..అతడ్నెలా
గుర్తించుకోవాలి! అన్న మాటకు సమాధానమే ఈ పుస్తకం.
ఎవరు సలహాలిచ్చినా సచిన్ నాలాగే వింటుంటాడట బ్రదర్!.. ఓ ఉద్యోగి తన సహచరుడితో
పరాచకాలు..
కోం ముహ్ ఖరాబ్ కర్ లే తేరే.. సచిన్ అక్తర్ తో అన్నట్టు ఓ బూతులాట గాడికి
క్ర్రీడాస్ఫూర్తి ఉన్నవాడి సలహా..
ఏపనికైనా సచిన్ 20 నిముషాలు ముందుంటాడట.. ఓ వ్యక్తిత్వ వికాస శిక్షకుడి
ఉదాహరణ..
తన వాచ్ మెన్ కొడుకు, చిన్నప్పటి స్నేహమేనంట.. పర్సనల్ అసిస్టెంట్.. తెలుగు
సినిమా పంచిన మంచిలోంచి సచిన్ ని కొలుస్తూ.. ఓ కాలేజీ కుర్రాడు..
ఇవన్నీ తెలిపేవి అతడో సెంచరీల వరద, రికార్డుల హోరు మాత్రమేకాదని, సచినంటే
వినయం.. నిగ్రహం.. నిరంతర సాధన.. నిత్య విజ్ఞానార్జన, మంచితనం.. అందుకే
పరుగుల దేవుణ్ని మర్చిపోయి సచిన్ ను గుర్తుంచుకుందాం అంటారు క్రీడా స్ఫూర్తి
తో రచయిత.
అరే.. నీకీ విషయం తెలుసా!.. చిన్నప్పుడు సచిన్ అందర్నీ కొట్టేవాడట.. కోపిష్ఠి
మెకన్రో ని ఆరాధించేవాడట..ఓ పిల్లవాడు తనలో సచిన్ ను చూసుకునే ప్రయత్నం..
తిరుగులేదు.. వీడు మనకొక ఆశాకిరణం. కావాల్సింది పట్టుదలే మనవాడికి.
“సచిన్ లా మెదటి మ్యాచ్ డకౌట్ కాదురా నేనూ..” సచిన్ ను దాటాలనే ఆశ.. వీడూ
గొప్పోడవుతాడు.. చదువులోనైనా.. ఆటలోనైనా..ఉద్యోగంలోనైనా.. జీవితం లోనైనా.. ఇది
నిజంగా ఛాంపియన్లను తయారుచేసే ప్రయత్నమే..
విజయగాథలను చూడాలని కలగంటున్నాడు..*
ఒక్క తరమైనా సచిన్ లా పరిగెడితే.. కాదు .. కనీసం ఆలోచిస్తే.. మన దేశం నిస్తేజ
సాగరాన మునిగే బదులు.. ఉప్పొంగే జీవన తరంగాల వెల్లువై పులకించిపోదా!!
“నేనే కాదు..ఎవరూ పరిపూర్ణులు కారు.. కాలేరు నిరంతరం నేర్చుకోవాల్సిందే.” ఇవి
సచిన్ మాటలు గా స్వీకరిస్తే.. అక్షరాలు సిక్సర్లుగా మదిలో కి దూసుకుపోతాయి..
తిరిగి మనల్ని కష్టమైన బంతుల్ని ఎదుర్కోవడానికి సన్నద్ధం చేస్తాయి.
నూతనోత్తేజం కోరే ప్రతి మనిషి తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
ఇది లోకానికి ఓ సంతోషపు ప్రేమ కానుక లా నాకనిపించింది
పుస్తకం: దేవుణ్ని మర్చిపోదామిక… సచిన్ ను గుర్తుంచుకుందాం (forget the
God… remember
Sachin)
రచన: రేగళ్ళ సంతోష్ కుమార్
పేజీలు: 80
ప్రచురుణ: సహృదయ సంతోషం ఫౌండేషన్
ప్లాట్ నెం. 68, లయన్స్ టౌన్ కాలనీ, హస్మత్ పేట, ఓల్డ్ బోయినపల్లి,
సికిందరాబాదు- 500009
sahrudayasantosham@gmail.com
http://kinige.com/kbook.php?
Yasaswi' సతీష్
www.blaagu.com/sateesh
(తెల్లకాగితం..కవిత్వ సంపుటి రచయిత)
Monday, 11 March 2013
క్రికెట్ ‘వీర’ లేవరా!
'ఎంతటి ఆటగాడైనా తానాడే స్థానాన్ని బట్టి శైలిని, ఆటతీరును సర్దుబాటు చేసుకుంటాడు. కానీ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం...తన శైలిని కాకుండా ఆడే స్థానాన్నే పునర్ నిర్వచించాడు. అదే అతని గొప్పతనం.''
భారత 'మాజీ కోచ్ జాన్‌రైట్ ఇచ్చిన కితాబిది! జాన్‌రైటనే కాదు... క్రికెట్ తెలిసిన ఎవర్ని అడిగినా చెబుతారు సెహ్వాగ్ ఆటేంటో! శైలేంటో! తీరేంటో!
జట్టు పరిస్థితిని గమనిస్తాడో లేదో తెలియదు...బౌలర్ ఎవరన్నది పట్టించుకుంటాడో లేదో తెలియదు...బంతిని అర్థం చేసుకుంటాడో లేదో తెలియదు...
సెంచరీకి చేరువవగానే ఎంతటి ఆటగాడైనా మెల్లగా ఆడేసి... వంద పూర్తి చేయటానికి ప్రయత్నించటం సహజం! అలాంటిది... ఇప్పటిదాకా తన జట్టు చరిత్రలో ఎవ్వరూ చేయని ట్రిపుల్‌సెంచరీ ముంగిట నిలబడి సిక్స్ కొట్టాడంటే....దాన్ని ధైర్యమందామా? మొండితనమందామా? వన్డేల్లో తన గురువు (సచిన్) పేరిటున్న ప్రపంచ రికార్డును (200 పరుగులు) చెరిపేసే అవకాశం వచ్చిన క్షణాన ఫోర్ కొట్టాడంటే దాన్ని నిర్లక్ష్యమనాలా? నిర్భయమనాలా?
ఓసారి ఇంగ్లాండ్ కౌంటీల్లో లీసెస్టర్‌షైర్ తరఫున ఆడుతున్నాడు. ప్రత్యర్థి జట్టులో అబ్దుల్ రజాక్! పాకిస్థానీ తరహాలో రివర్స్ స్వింగ్ మొదలెట్టాడు. బ్యాట్స్‌మెన్‌కు ముఖ్యంగా... సెహ్వాగ్ సహచరుడికి ఇబ్బంది మొదలైంది. దీంతో సెహ్వాగ్ ఓ వ్యూహం రచించాడు. తర్వాతి బంతిని నేరుగా గ్రౌండ్ బయటపడేలా సిక్స్‌గా మలిచాడు. అంపైర్లకు కొత్త బంతి తీసుకోకతప్పలేదు. ''ఇక మరో గంట దాకా రివర్స్ స్వింగ్ భయం లేదు. పండగ చేసుకో'' అన్నాడు తన సహచరుడితో సెహ్వాగ్!
అందుకే... జాన్‌రైట్‌లాంటివాళ్ళు తెలివైన వాడని కితాబిస్తే... జెఫ్రీ బాయ్‌కాట్‌లాంటివాళ్ళకది తెలివైన మూర్ఖత్వంలా కనిపించింది! ఎవరేమనుకున్నా తన తీరుకు సెహ్వాగ్ పెట్టుకున్న పేరు సహజ శైలి! ఏమైతే అదవుతుంది... నా శైలి నాది అనే ఆ తత్వమే సెహ్వాగ్‌తో ఇన్నాళ్ళూ పరుగులు పెట్టించింది. ఇప్పుడు అదే కెరీర్‌కు ప్రమాదంగా పరిణమించింది కూడా!
నిజానికి.... వివ్ రిచర్డ్స్‌లోని విధ్వంసం... డేవిడ్ గ్రోవర్‌లోని శిల్పం... విశ్వనాథ్‌లోని విన్యాసం.... సచిన్‌లోని నైపుణ్యం... ఇన్నింటి కలబోత వీరేంద్ర సెహ్వాగ్! తనంతగా ఏ బౌలర్‌నూ ఏ క్షణంలోనూ లెక్కచేయకుండా... ధైర్యంగా ఆడిన మరో బ్యాట్స్‌మెన్ సమకాలీన క్రికెట్‌లో ఉండడంటే అతిశయోక్తికాదు.
ఏ ఆటగాడైనా ఒకసారి ఔటైనట్లుగా మరోసారి ఔట్‌కావాలని కోరుకోడు! తప్పులెక్కడ చేశానో చూసుకొని సర్దుకుంటాడు! కానీ వీరూ రూటే వేరు! తొలి ఇన్నింగ్స్‌లో ఔటైనట్లే రెండో ఇన్నింగ్స్‌లోనూ ఔటవుతాడు! సర్దుకోవటాలు... సరిదిద్దుకోవటాలు లేవన్నట్లు ఆడతాడు! అందుకే ఛాపెల్ లాంటివాళ్ళకు కొరుకుడు పడని కొయ్యగా మిగిలిపోయాడు! నిజానికి వీరూ విధ్వంసక ఇన్నింగ్స్‌లో చాలామటుకు ఆ ధోరణితో వచ్చినవే! అభిమానుల్ని మెప్పించినవే! వయసులో ఉన్నంత కాలం అది బాగానే నడిచింది! కానీ ఇప్పుడు... 36 దాటుతున్నాడు. శరీరకదలికల్లో... సమన్వయంలో తేడా వస్తుంది... వస్తోంది! ఇన్నాళ్ళు ఆడినట్లే ఇప్పుడూ ఆడతానంటే కుదరకపోవచ్చు. సర్దుబాట్లు తప్పకపోవచ్చు. సచినంతటివాడే శరీరం సహకరించక కొన్ని షాట్లను అస్త్రసన్యాసం చేసేశాడు. ఆటతీరును మార్చుకున్నాడు. వీరూ చేయాల్సిందల్లా ఇప్పుడు మానసికంగా మారటమే! శరీర ధర్మాన్ని అనుసరించి సర్దుకోవటానికి సిద్ధపడటమే! ఆ నిర్ణయం తీసుకోవటానికి వీరూ సిద్ధపడతాడా? లేదా? అనేదే ఆసక్తికరం!
అభిమానుల్ని అలరించిన అద్భుత బ్యాట్స్‌మన్ కెరీర్ ఇలా ముగియాలని ఏ అభిమానిగానీ... అంతెందుకు సెహ్వాగ్ బారిన పడ్డ ఏ ప్రత్యర్థి బౌలర్‌గానీ కోరుకోడు!
అభిమానుల్ని అలరించిన అద్భుత బ్యాట్స్‌మన్ కెరీర్ ఇలా ముగియాలని ఏ అభిమానిగానీ... అంతెందుకు సెహ్వాగ్ బారిన పడ్డ ఏ ప్రత్యర్థి బౌలర్‌గానీ కోరుకోడు! చివరకు సెహ్వాగ్ కూడా! గతంలో ఓసారి ''మీకూ సచిన్‌కు తేడా ఏంటంటే...'' - ''బ్యాంక్ బ్యాలెన్స్'' అని ఓసారి బదులిచ్చాడు వీరూ! నాడు పరాచికానికే ఆ మాట అన్నప్పటికీ... ఇప్పుడు నిజంగానే తన గురువుకూ తనకూ ఉన్న తేడా అదేనని నిరూపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది! అంటే... గడ్డుకాలాన్ని దాటి మళ్ళీ పరుగులెత్తించే సత్తా తనలో ఉందని నిరూపించుకోవాలిప్పుడు! అలా మళ్ళీ సిద్ధమైన తర్వాత... ఓపెనింగ్ కాకుంటే నాలుగోస్థానంలో దిగొచ్చేమో! ఎలాగూ తొలినాళ్ళలో తన స్థానమదే! బహుశా మొదలెట్టిన చోటే ముగించే అవకాశం దొరుకుతుందేమో!
అందుకే... 'వీరు'డా లే!
లోకమంతా క్యారమ్ బాల్‌ను చూసి కకావికలవుతున్న వేళ....
కాలు కదపకుండా సింహనాదం చేసి
అజంతా మెండిస్ అనే బౌలర్‌ను చరిత్రలో కలిపేసిన క్షణాల్ని గుర్తుకు తెచ్చుకో!
తాండవాలు చేయకుండా....
తారంగంలా చేతులూపి....బ్యాట్ తిప్పి... ట్రిపుల్ సెంచరీతో
పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన ముల్తాన్ క్షణాల్ని స్మరించుకో!
శ్రీలంకతో మ్యాచ్‌లో జట్టు జట్టంతా 329 చేస్తే...
అందులో నీవొక్కడివే 201 చేశావని జ్ఞాపకం చేసుకో!
చెన్నైలో దక్షిణాఫ్రికాపై...
ఒక్కరోజులోనే 257 పరుగులు చేశావనీ...
304 బంతుల్లోనే 319 సాధించావనీ..
ఇప్పటికీ నీ స్త్ట్రెక్‌రేట్ 82.33 అనీ...
గుటక వేసినంత సులభంగా ఫోర్లు కొట్టగలవనీ...
నీళ్ళు తాగినంత అలవోకగా సిక్స్‌లు బాదగలవనీ...
ఏటీఎంలో డబ్బులు తీసినంత సులువుగా సెంచరీలు చేయగలవనీ..
ఒక్కసారి మననం చేసుకో....!!
ఘనంగా ముగించు... జనంలో ముగించు!
( మార్చి 9, శనివారం, 2013న ఈనాడులోప్రచురితమైన నా కథనం ఇది)
Saturday, 9 March 2013
ఆలస్యం అంత విషమా?
ఎగ్జామ్ మొదలైన 15 నిమిషాల తర్వాత వస్తే అనుమతించం...
పరీక్ష హాల్లోకి నిమిషం ఆలస్యంగా వచ్చినా వాపస్ వెళ్ళాల్సిందే.
సమయం ముంచుకొస్తుండటంతో పరుగెత్తుతున్న విద్యార్థులు...
సమయానికి చేరుకోలేక పోయానని దిగులుతో ఏడుస్తున్న విద్యార్థిని...
అనుమతించాలంటూ ప్రిన్సిపాల్ ను వేడుకొంటున్న విద్యార్థులు....
పరీక్షల వేళయిందంటే చాలు ఇలాంటి ప్రకటనలు... వార్తలు... తరచూ కనిపిస్తుంటాయి.
అదే సమయంలో
చీకట్లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు...
క్యాండిల్ వెలుతురులో పరీక్ష రాస్తున్న విద్యార్థులు...
బెంచీలు లేక వరండాలో కింద కూర్చొని పరీక్ష రాస్తున్న విద్యార్థులు....
ఇవీ కనిపిస్తాయి పత్రికల్లో....
ఇవి కనిపించినప్పుడల్లా ఒక ప్రశ్న తొలుస్తుంటుంది....
కనీస సౌకర్యాలు కల్పించలేని వాళ్ళు....
విద్యార్థులకు మాత్రం కచ్చితంగా ఒక నిమిషం, 15 నిమిషాలంటూ ఎందుకు క్రమశిక్షణ విధించాలని
చూస్తారు?
అసలు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వస్తే వచ్చే నష్టం ఎవరికి?
విద్యార్థులకా? ప్రభుత్వానికా?
పరీక్ష కేంద్రాలకు చేరుకోవటానికి సరైన రవాణా సదుపాయాలుండవు...
చేరుకున్నాక... కూడా సదుపాయాలు సమకూర్చలేరు. పరీక్ష పేపర్లు కూడా తప్పులులేకుండా
తయారు చేయలేరు... కానీ... అదేంటో... విద్యార్థులను మాత్రం పరుగులెత్తిస్తారు. టెన్షన్
పెడతారు.. ఏడిపిస్తారు....
ట్రాఫిక్ జామో... అనుకోని అవాంతరమో ... కారణం ఏదైనా కావొచ్చు... ఆలస్యం కావటానికి!
ఒక్క నిమిషం ఆలస్యమైందని ఏడాది చదువును నాశనం చేయటం ఏం న్యాయం?
ఆలస్యమైతే నష్టపోయేది విద్యార్థే. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయటానికి సమయం సరిపోక
ఇబ్బంది పడేది విద్యార్థేగాని నిర్వాహకులు కాదే!
కావాలంటే పరీక్ష పూర్తయ్యే దాకా హాల్ లోంచి బయటకు వెళ్ళనీయమని నిబంధన పెట్టడాన్ని
కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ నిమిషం దాటితే రానివ్వకపోవటంలో కారణం మాత్రం
విచిత్రం.
క్రమశిక్షణ పాటించటం బాగానే ఉంటుంది. కానీ అది జీవితాన్ని నిలబెట్టడానికి సాయపడాలే తప్ప కూల్చటానికి కాదు.
Thursday, 7 February 2013
ఐ హేట్ గవర్నమెంట్ స్కూల్స్ రే.....!!!
ఈ రోజు వ్యాన్ కాస్త రిపేర్ ఉందిసార్... మీరే ఎలాగైనా బాబును
తీసుకెళ్ళండని ఫోన్ రావటంతో,
ట్యూషన్ నుంచి మావాణ్ణి తీసుకురావటానికి వెళ్ళా!
మా వాడితో పాటు
ఇంటికి దగ్గర్లోనే ఉండే మరో అబ్బాయి కూడా కారెక్కాడు...
మా వాడు చదివేది
కేంద్రీయ విద్యాలయ... ఆ అబ్బాయిది.... ప్రైవేటు కాన్వెంట్ స్కూలు...
ఇద్దరూ
మాట్లాడుకుంటున్నారు....
ఆ అబ్బాయికి
కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు వచ్చిందనీ ... అక్కడికి వెళ్ళిపోతున్నాననీ
చెప్పాడు...
వాళ్ళిద్దరి
మాటల్లో మరో మిత్రుడి ప్రస్తావన వచ్చింది.... అతనే స్కూల్ అని అడిగాడు ఆ అబ్బాయి...
మావాడు.... స్కూల్
పేరు చెప్పాడు...!
ప్రైవేటా?
గవర్నమెంటా? అన్నాడా అబ్బాయి....
నాన్నా ఏదో
అంటారుగదా వాటిని... అని నా వైపు తిరిగాడు...
ఎయిడెడ్ స్కూల్
అని చెప్పా...
అంటే స్కూల్ కు గవర్నమెంట్
సాయం చేస్తుంది.... అని వివరించా...!
‘‘ఐ హేట్ గవర్నమెంట్ స్కూల్స్ రే’’ అన్నాడా అబ్బాయి ఉన్నట్టుండి...
మా వాడికి కాస్త
అహం దెబ్బతింది... మాది సెంట్రల్ గవర్నమెంటు స్కూల్ అన్నాడు...
సెంట్రల్
గవర్నమెంట్ అయినా గవర్నమెంటే గదా అన్నాడా అబ్బాయి...
కానీ మా స్కూల్లో
బాగా చెబుతారు తెలుసా? అని సమర్థించుకున్నాడు మావాడు...
వాళ్ళ సంభాషణలోకి
దూరి... గవర్నమెంటు స్కూలంటే ఎందుకు అసహ్యం అని అడగాలనిపించింది... అంతలోనే....
ఆ అబ్బాయి.... ‘‘కోరుకొండ స్కూల్లో చదివితే ఎన్.డి.ఎ. లో
సీటొస్తుంది... తర్వాత మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందట... మా నాన్న చెప్పాడు... అందుకే
వెళుతున్నా... ’’
అని చెప్పాడు...
మా వాడు...
కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రైవేటా? గవర్నమెంటా? అని అడిగాడు!
అంతలో ఆ అబ్బాయి
ఇల్లొచ్చింది... బాయ్ రా.... ... థ్యాంక్స్ అంకుల్... అంటూ దిగిపోయాడు...
సమాధానం
ఇవ్వకున్నా.... ఆ అబ్బాయి మనసులో మా వాడు అడిగిన ప్రశ్న గింగురుమంటుందని నాకు
తెలుసు...
నిజమేగదా.....
మనకు
గవర్నమెంటు... స్కూళ్ళకు వెళ్ళం...
గవర్నమెంటు ఆస్పత్రులకు
వెళ్ళం....
గవర్నమెంటు
ఉద్యోగం మాత్రం కావాలి....
మన పిల్లలకు కూడా
అదే నేర్పుతున్నాం...
అందుకే ఇందాక ఆ
అబ్బాయి అలా అనటంలో తప్పులేదనిపించింది...
నిజానికి ఆ
అబ్బాయి చదువుతోంది... మంచి కాన్వెంట్ లోనే అయినా మళ్ళీ ట్యూషన్ పంపించటం
తప్పనిసరి అవుతోంది...
ఇప్పుడు
వెళుతోంది కూడా కోరుకొండ సైనిక్ స్కూలు గవర్నమెంటుదే...
నిజానికి ప్రైవేటు
వాటితో పోలిస్తే... గవర్నమెంటు స్కూళ్ళలో మంచి శిక్షణ పొందిన టీచర్లుంటారు...
అయినా మనకు
వాళ్ళపై నమ్మకం ఉండదు...
కారణం....
పట్టించుకొని చెప్పరని.... శ్రద్ధ తీసుకోరేమోనని...
ఇందులో కొంత నిజం
కూడా లేకపోలేదు....
మా చెల్లి
గవర్నమెంటు స్కూల్లో ఫిజిక్స్ చెబుతుంది....
చెప్పాలన్న తపన
ఉంది.....
‘‘ఈ పిల్లలకు ఎంత చెప్పినా బుర్రలకు ఎక్కదురా?’ అందోసారి....
జెమ్స్ కు నువ్వు
చెప్పేదేంటి? యావరేజ్ బిలో యావరేజ్ లాంటి వారికి చెప్పి పైకి తీసుకొస్తేనే గొప్ప
అన్నాను...
‘‘ జెమ్స్ అని కాదు... వీళ్ళలోనూ మంచిగా చదివేవాళ్ళు... కష్టపడితే
తయారయ్యేవాళ్ళూ ఉంటారు... కానీ ఒకరో ఇద్దరో... మిగిలిన వాళ్ళంతా... మెజార్టీ.... బిలో
యావరేజ్ లాంటి వారికంటే తక్కువ స్థాయి వాళ్ళు ! గవర్నమెంట్ స్కూళ్ళలో ఇలాంటి వాళ్ళే మిగులుతున్నారిప్పుడు...
ఏమాత్రం కొద్దిగా చదివించే స్థోమత ఉన్నా ప్రైవేటుకే పంపిస్తున్నారు. నా బిడ్డనే
తీసుకో.... ప్రైవేటుకే పంపిస్తున్నాను... అక్కడి టీచర్లకు పద్ధతిగా చెప్పటం రాదని
నాకు తెలుసు... మాకంటే బాగా చెప్పలేరనీ తెలుసు... అలాగని మా స్కూల్లో వేయలేను... వేసే
రిస్క్ తీసుకోలేను... అక్కడ రుద్దయినా చదివిస్తారు... ఇక్కడ మేం... బాగానే
చెబుతాం... కానీ... శ్రద్ధ తీసుకోం... హోం వర్క్ల్ లివ్వం... ఇచ్చినా చేశారా లేదా
అని చూడం... మేం చెప్పినా చెప్పకున్నా పట్టించుకునే వాళ్ళు లేరు... ఒకవేళ నేను
బాగా చెప్పినా... అందరు టీచర్లూ అలాగే చెబుతారని గ్యారెంటీ లేదు.. కాబట్టి నా బిడ్డను చేర్పటానికి నాకు ధైర్యం
లేదు...’’
అంటూ ఏకరువు
పెట్టింది....
మా చిన్నప్పుడు
ఊర్లో ఒకటే గవర్నమెంటు స్కూలుండేది...
కలెక్టర్
కొడుకైనా... కూలీ పిల్లలైనా దానికే రావాలి.... టీచర్ల పిల్లలైనా అంతే...
కాబట్టి స్కూళ్ళలో
చదువు శ్రద్ధగా ఉండేది....
.కనీసం. ఉన్నట్లు
అనిపించేది...
కానీ ఇప్పుడు ...
మానసికంగా మనకు ఆ ధైర్యం లేదు...
టీచర్లకు లేదు...
సమాజానికి లేదు....
ప్రైవేటులో
వేస్తే మా వాళ్ళు వెనకబడి పోతారేమో.... అనే ఆందోళన!
ప్రైవేటుస్కూళ్ళతో
పోటీపడి మంచి విద్యార్థులను తయారు చేస్తున్న మంచి గవర్నమెంటు స్కూళ్ళు ఉన్నాయి...
కానీ వాటి సంఖ్య చాలా తక్కువ.
కోరుకొండ సైనిక్
స్కూలు గవర్నమెంటుదే....
కేంద్రీయ
విద్యాలయాలు... గవర్నమెంటువే...
నవోదయలు... గవర్నమెంటువే...
వాటిలో చోటు కోసం
ఎందుకని తపిస్తున్నారు...
కారణం... అక్కడ
క్రమశిక్షణ... ఉంటుందనే నమ్మకం
ఇవన్నింటిలో వాస్తవంగా లోపాలున్నా...కేవలం నమ్మకం ఒకటే వాటి వైపు ఆకర్షింపజేస్తుంది...
టీచర్ల,
గవర్నమెంటు ఉద్యోగుల పిల్లలను తప్పనిసరిగా గవర్నమెంటు స్కూళ్ళలోనే చదివించాలని అని
ఆదేశాలిస్తే పరిస్థితి మారుతుందేమో?
ఇది చెట్టు
ముందా... విత్తనంముందాలాంటిదే...!
సిటీ లైఫ్ ....
రాత్రి
ఇంటికెళ్ళేసరికి... పక్కింటి ముందర ఫంక్షన్ ఏదో జరుగుతోంది...
ఏంట్రా అని అడిగా
మా అబ్బాయిని...
పక్కింటి
ఆంటీవాళ్ళింట్లో పై పోర్షన్లో ఉండేవాళ్ళ ఇంట్లో బర్త్ డే అంట...అన్నాడు..
వాడవాళ్ళెవరూ
కన్పించలేదు నాకు..
రాత్రి
పదిన్నరైంది....
ఇంటి ముందరి
అపార్ట్ మెంట్లోంచి భాజాభజంత్రీలు... (బ్యాండ్)
మోగుతున్నాయ్...
ఏంటని బయటికెళ్ళి
బాల్కనీలోంచి చూశా...
సెల్లార్లో...
ఆడవాళ్ళు ... ముఖం నిండా కొంగులు కప్పుకొని
రాజస్థానీ
సంప్రదాయ నృత్యం చేస్తూకన్పించారు...
ఆ అపార్ట్ మెంట్లో
అద్దెకుంటున్న మార్వాడీల ఇంట్లో పెళ్ళి సందడిలా ఉంది...
అది పెళ్ళో
నిశ్చితార్థమో... తెలియదు
అందుకే పెళ్ళి
సందడన్నాను...
ఉదయం ఆఫీస్ కు తయారవుతుంటే... మళ్ళీ భాజాలుమోగాయి...
ఈసారి చూస్తే....
సూటూబూటులో ఓ అబ్బాయి కనిపించాడు...
చేతిలో ఓ జొన్నకంకిలాంటి పొడవాటి దండం ఉంది...
సంప్రదాయ టోపీ పెట్టారు... అమ్మాయిలంతా మార్వాడీభాషలో పాటలు పాడుతూ వెంటరాగా ...
పెళ్ళికొడుకు గేట్ దగ్గరకొచ్చాడు... గేట్ మూలకు స్తంభంలా ఉంది... దానికే పూజ
చేశారు... ఊర్లో ఉండే పందిరి పూజలాంటిదై ఉంటుంది....
కొద్ది సేపటి తర్వాత భజంత్రీల జోరు పెరిగింది....
అప్పటిదాకా వెంట ఉన్న అమ్మాయిలు... డాన్స్ చేయటం మొదలెట్టారు... సంప్రదాయ
నృత్యమే...
పెద్దవాళ్ళు కూడా వాళ్ళకు తోడుగా కలిశారు...
మగవాళ్ళు మాత్రం చూస్తూ నిలబడ్డారు...
ఆశ్చర్యమనిపించింది....
ఎందుకంటే... మామూలుగా మార్వాడీల్లో... చాలామంది అమ్మాయిలు ముఖం మీది నుంచి కొంగు
కప్పుకొని ఉంటారు... రోడ్డుమీద
నడిచేటప్పుడు కూడా...
అలాంటిది నడిరోడ్డుపై ఆనందంగా ... స్వేచ్ఛగా
వాళ్ళు డాన్స్ చేస్తుంటే... మగవాళ్ళు నిలబడి చూస్తుండటం...
బహుశా ఇది ఆచారంలో భాగమేమో అనిపించింది...
ఆచారానికి పట్టువిడుపులూ అందమేనేమో...
సర్లెండి ఇదంతా పక్కనబెడితే...
ఆ మార్వాడీ కుటుంబం తెలుసుగాని...
ఆ పెళ్ళి పిల్లాడిని మాత్రం ఎప్పుడూ చూసిన గుర్తులేదు...
మరి ఎవరబ్బా..? ఇంతకూ
ఇది పెళ్ళా... నిశ్చితార్థమా?
మా పనిమనిషినడిగా....
ఎదురింటి అపార్ట్ మెంట్లో తన మిత్రుల సాయంతో తెలుసుకొని సమాచారం
తీసుకొచ్చింది...
ఏమో వాళ్ళకూ తెలియదంట.... అని
ఎదురింటి వాళ్ళం మాకు తెలియలేదంటే ఫర్వాలేదు... కనీసం ఒకే అపార్ట్ మెంట్లో
ఉంటున్న వాళ్ళకు కూడా తెలియలేదంటే బాధేసింది...
రాత్రి బర్త్ డే ఫంక్షన్... ఈ పెళ్ళి. వేడుక... అన్నీ...
ఎవరికి వారే
ఇదేనేమో సిటీ లైఫంటే...
ఇదే ఊర్లోనైతే....
ఇలాగే ఉండేదా?
ఎవరింట్లోనైనా పెళ్ళంటే... పదిరోజుల ముందు నుంచే... పక్కింట్లో
కాదు... వీధివీథంతా హడావుడి...
తమదే వేడుకన్నట్లు కలసిపోతారు...
పనులెక్కడికొచ్చాయనో.... చేయటానికేమైనా పనులున్నాయా అనో..
వచ్చి మరీ అడిగిపోతారు....
ఇక అసలురోజైతే అంతా ఇక్కడే ఉండిపోతారు....
పెళ్ళిళ్ళ దాకా ఎందుకు...
మా అమ్మానాన్నా హైదరాబాద్ నుంచి ఊరికెళితే...
వాళ్ళు బయల్దేరటానికి వారం రోజుల ముందు నుంచే హడావుడి
మొదలవుతుంది...
నాన్నవాళ్ళు వస్తున్నారని... చుట్టుపక్కల వాళ్ళు పనిమనిషిని
పిలిపించి ఇల్లు కడిగించి పెడతారు...
నాన్నవాళ్ళు వెళ్ళిన రోజున మధ్యాహ్నం మా ఇంటికంటే... రాత్రి
మా ఇంటికి అంటూ రెండుపూటలా భోజనాలకు ముందస్తు ఆహ్వానం పలుకుతారు...
రోజూ కూరగాయల కోసం మార్కెట్ కు వచ్చే వాళ్ళలో కనీసం
నలుగురైదుగురైనా
ఇంట్లోకి వచ్చి సార్ ఎలా ఉన్నారు... అంటూ పలకరించి చాయ్
తాగి వెళతరాు...
నాన్నవాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళను దగ్గరుండి మరీ
బస్సెక్కిస్తారు..
వచ్చాక క్షేమంగా చేరుకున్నారా అని కబుర్లాడుతారు...
అదే మనుషులంగదా....
పల్లెటూర్ల నుంచి పట్నాలకు రాగానే మారిపోతామేం?
పల్లెటూర్లో ఉండే
బంధాలు ... అనుబంధాలు...
పట్నాలకు రాగానే మాయమవుతాయా?
కొడవటిగంటి గారన్నట్లు....
ఆకాశంలో పైకి వెళ్ళే కొద్దీ... ఆక్సీజన్ తగ్గినట్టే...
జీవితంలో పైకి వెళ్ళేకొద్దీ... బంధాలు బలహీనపడతాయంటే
ఇదేనేమో....
అయినా పల్లె వీడి పట్నానికొస్తే... పైకొచ్చినట్లా?
Monday, 4 February 2013
వీక్.... ఎండ్.....
నాన్నా.... వీకెండ్ కదా... ఎక్కడికైనా పోదామా?
ఎక్కడికిరా? అన్నాను...
ఎక్కడికైనా... తీసుకెళ్ళు....
బిర్లామందిర్? అన్నాను...
ఎప్పుడూ గుళ్ళేనా.... ఏదైనా ఆడుకునే ప్లేస్ కు
తీసుకెళ్ళు....
ఐమాక్స్ కు.... లేదంటే
జలవిహార్.....
మొదలు ఎక్కడికైనా అన్నవాడు.... ఇలా లిస్ట్
చెప్పేస్తున్నాడు...
చివరకు అలా తిరిగి.... ఫలానా చోట తినేసి వద్దాం... అంటూ
ముగించేశాడు...
మా చిన్నప్పుడు ఇలాగే అడిగామా అమ్మానాన్నల్ని?
నాకైతే ఎన్నడూ అడిగినట్టు గుర్తులేదు...
అసలు వీకెండ్ అనే కాన్సెప్టే తెలీదు...
తెలీదేంటి... అసలు లేనే లేదు...
శనివారం... ఆదివారాలకు ప్రత్యేకతమీ లేదు....
వీకెండ్ అంటూ వాటిని మిగిలిన వారాల్లోంచి వేరు చేసి చూసింది
లేదు....
ఆ రెండు రోజుల్లో ఎటు వెళ్ళాలంటూ.... ప్లానింగ్ చేసింది
లేదు.....
ఆ మాటే అంటే.... మావాడు ఏం ఎందుకలా? మరి శని, ఆదివారాలేం
చేసేవారు? అన్నాడు....
అవును నిజమే... ఏం
చేసేవారం?
ఇప్పుడనిపిస్తున్న వీకెండ్ అప్పుడెందుకు అనిపించలేదు?
ప్రతిరోజూ స్కూల్ నుంచి రాగానే... బ్యాగ్ లు పడేసేది...
ఆడుకోవటానికి వెళ్ళేది....
సాయంత్రం వచ్చాక.... అరగంటో... గంటో చదువుకొని...
నిద్రపోయేది....
అంతే... రోజూ ఇదే తంతు....
ఆటలంటే ఎన్ని ఆటలని...?
క్రికెట్... వాలీబాల్, బ్యాడ్మింటన్.... కబడ్డీ... బాల్
బ్యాడ్మింటన్..... ఆడని ఆటలేదు...
గమ్మత్తమేంటంటే....
అప్పటిదాకా... మాకు చదువు చెప్పిన టీచర్లే సాయంత్రం
అయ్యేసరికి మాతో పాటు కలసి ఆడేవాళ్ళు...
భలే ఉండేది..... ఇవే కాదు....
వానలు పడగానే.... సలాక (ఇనుప చువ్వ) తీసుకొని.... తడినేలలో
విసురుకుంటూ వెళ్ళేవాళ్ళం.... నిటారుగా కుచ్చుకోకుండా... ఫ్లాట్ గా చువ్వ
పడిపోయిందంటే... ఇంకొడడు మొదలెట్టేవాడు... అలా వెంచుకుంటూ.....
ఆరుద్ర పురుగులు పట్టుకొని... అగ్గిపెట్టెల్లో దాచడం....
సీతాకొలుక చిలకల్ని పట్టడానికి ప్రయత్నించటం....
గొంగడిపురుగుల్ని ఇంట్లోకి రానీకుడా చూడటం...
అప్పడాల గుర్రాలతో ఆడటం....
చివరకు టెన్త్ క్లాస్ అయ్యాక కూడా...
ఊరి చివర్లో ఉన్న టింబర్ డిపోలో వేలానికి పెట్టిన....
కలప దుంగల వెనక దాక్కుంటూ... దాగుడుమూతలాడాం....
నిజానికి ప్రతిరోజూ డే ఎండ్ ను అద్భుతంగా... ఎంజాయ్
చేసేవాళ్ళం...
ఒక్కమాటలో చెప్పాలంటే... ప్రతి రోజునూ వీకెండ్ లాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం...
అనుక్షణం ప్రకృతి ఒడిలో పరవశించేవాళ్ళం....
అందుకే... శని ఆదివారాలంటే వేరుగా ఉండేది కాదు...
వీకెండ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ అవసరం రాలేదు....
ఇంకా... ఆదివారం వస్తే... ఆడటానికి టీచర్లు రారని...
ఎందుకొచ్చిందా ఈ ఆదివారమని బాధపడేవాళ్ళం...
కానీ ఈతరానికొచ్చేసరికి....
స్కూలు... స్కూలు కాగానే.. రెండు గంటల సేపు ట్యూషన్లు...
అప్పటికల్లా చీకటిపడుతుంది....
వెంటనే... టీవీ ముందుకొంచెం సేపు కూర్చొని.... పోగోనో...
కార్టూన్ నెట్ వర్క్ .... చూడగానే...
తిని తొంగోవటం...
ఓ ఆరుద్ర పురుగు తెలవదు..... గొంగడిపురుగు తెలవదు...
అన్నీ.... పుస్తకాల్లోనే....
ప్రకృతంతా బొమ్మల్లోనే....
అందుకే... వీకెండ్లూ.... వీక్ బిగినింగ్లూ..........
సెలవుల కోసం ఎదురుచూపులు...
బంద్ ల కోసం జిందాబాద్ లు.....
Saturday, 2 February 2013
ఎందరో మగానుభావులు... అందరికీ వణక్కం
త్యాగరాజ ఆరాధనోత్సవాలు....
టీవీలో చూపిస్తున్నారు...
ఎక్కడ నాన్నా ఇది జరుగుతోందన్నాడు
తొమ్మిదో తరగతి చదువుతున్న
మా పెద్దబ్బాయి...
తంజావూరు... తిరువయ్యార్... అని చెప్పా...
తమిళనాడు తంజావూరా? అన్నాడు...
ఔనన్నట్లు తలూపా
మరి తమిళియన్స్ తెలుగులో పాడుతున్నారేంటి? అన్నాడు....
త్యాగరాజు తెలుగుదనం గురించీ... పంచ కృతుల గురించీ... వాడికి
వివరించి.... పంపించాక అన్పించింది...
నిజమేగదా... ఈ తమిళులిలా పాడకుండుంటే... త్యాగరాజు ఏమయ్యేవాడో?
తెలుగువాడైనా త్యాగరాజును బతికిస్తున్నందుకు తమిళతంబిలకు థ్యాంక్స్
చెప్పాల్సిందే...
లేదంటే చాలామంది లాగే ఆయన్నూ ఎన్నడో చరిత్రలోకలిపేసే వాళ్ళం...
గమ్మత్తేమంటే... నిన్నటి హిందూ పేపర్లో గుడిపూడి శ్రీహరిగారు
బెంగళూరు నాగరత్నమ్మ గురించి రాసిన ఆర్టికల్ కన్పించింది...
ఆమె ఓ దేవదాసి... కన్నడిగ...
తన ఆస్తి పాస్తులన్నింటినీ అమ్మి... దుమ్ము కొట్టుకుపోయిన త్యాగరాజు సమాధిని
జీర్ణోద్ధరణ చేసిన మహానుభావురాలు...
నాడు కన్నడిగురాలు గుడి కడితే....
నేడు తమిళులు (తమిళులనే ఎందుకు మన తెలుగువారు కూడా బోలెడంత మంది అక్కడికి
వెళతారని ఎవరైనా ఆక్షేపించొచ్చుగాక....) ఆ మహానుభావుణ్ణి బతికిస్తున్నారు....
మనం మాత్రం ఆయన్ను మరచిపోయాం...
ఎవరో కొంతమంది సంగీతకళాకారులకు తప్పించి...
త్యాగరాజు తెలుగువాళ్ళలో ఎంతమందికి తెలుసు?
ఈ తరానికి?
త్యాగరాజు తెలుగువాడని ఎంతమందికి తెలుసు?
ఆయన వంశం తెలుగునేలపై ఎక్కడ ఉండేదో ... ఎంతమందికి తెలుసు?
అయినా తెలుగువాళ్ళుగా మనకు మనవాటిపై ప్రేమవేటిపై ఉందని?
అసలు మనవంటూ మనకు ఏమున్నాయని?
తమిళులకు ఇడ్లీ సాంబారు... లుంగి ఉన్నట్లు...
మనకంటూ ప్రత్యేకం ఏమైనా ఉందా?
ఉన్న కూచిపూడిని... పద్యాన్ని.... అవధానాన్ని.... ఎన్నడో ప్రదర్శన వస్తువుగా
పరిమితం చేశాం....
ఇది తెలుగువాళ్ళ స్పెషల్ అని చెప్పుకోవటానికి... ఇతరులు గుర్తించటానికి...
ప్రత్యేకం ఏముందని?
కొట్టుకోవటం... తిట్టుకోవటం... బహుశా ఇదే మన స్పెషాలిటీ...
జగమెరిగిన జర్నలిస్టు... జి. కృష్ణగారు ఓ మాటన్నారు...
అప్పట్లో డర్బన్ (దక్షిణాఫ్రికా)లో తెలుగువారంతా కలసి ఓ వీధికి ఓరుగల్లు అని
నామకరణం చేశారంట.... ఇది తెలిసి చాలా
సంతోషమేసింది అని అన్నారాయన...
సంతోషం ఎందుకంటే... డర్బన్లో వీధికి ఓరుగల్లు అని పెట్టినందుకు కాదు...
తెలుగువారంత ‘కలసి’ ఒకే పేరు పెట్టినందుకు అని కృష్ణ గారి ముక్తాయింపు....
బాగుందిగదూ...... బాపులాంటివారికి కూడా ఇన్నిరోజులు
పద్మశ్రీ అవార్డు రాలేదని....
ఇప్పుడు కూడా తమిళనాడు కోటాలో వచ్చిందని గుర్తించలేని
తెలుగువాళ్ళం మనం...
కాబట్టి త్యాగరాజు తెలియకపోవటంలో తప్పేం లేదు....
బహుశా నాడు త్యాగరాజైనా... నేడు బాపైనా... ముందుచూపున్నారు కాబట్టే ... ముందే
తమిళనాడెళ్ళిపోయారు....
ఎందరో మగానుభావులు.... (‘హ’ను తమిళులు ‘గ’గా పలుకుతారు.
అస్సలు పలకని దానికంటే ఏదో ఒకటి పలకటం మేలుకదా...) అందరికీ వందనాలు అని వణక్కం పెట్టుకోవటం
తప్పించి....
అంతకుమించి ఏం చేయగలం మనం?
Subscribe to:
Posts (Atom)